ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరిగిన రోడ్డు ప్రమాదాలు... ఎక్కువైన దొంగతనాలు - Ananthapuram Police Annual Report

అనంతపురం జిల్లా పోలీసు శాఖ వార్షిక నివేదికను ఎస్పీ సత్యయేసుబాబు విడుదల చేశారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు పెరగటంతో పాటు మృతుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి దోచుకునే నేరాల సంఖ్య  పెరిగినప్పటికీ, ఈ తరహా నేరాలకు పాల్పడే పలు ముఠాలను పోలీసులు పట్టుకున్నారని తెలిపారు.

Ananthapuram Police Annual Report
అనంతపురం జిల్లా పోలీసు శాఖ వార్షిక నివేదిక

By

Published : Dec 30, 2019, 8:02 PM IST

అనంతపురం జిల్లాలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు పెరగటంతో పాటు మృతుల సంఖ్య పెరిగింది. జిల్లా పోలీసు శాఖ వార్షిక నివేదికను ఎస్పీ సత్యయేసుబాబు విడుదల చేశారు. వార్షిక నివేదిక ప్రకారం గత ఏడాది 930 రోడ్డు ప్రమాదాల్లో 526 మంది మృతిచెందారు. ఈ ఏడాది 1178 ప్రమాదాల్లో 585 మంది మరణించారు.

ఇళ్ల తాళాలు పగలగొట్టి దోచుకునే నేరాల సంఖ్య పెరిగినప్పటికీ, ఈ తరహా నేరాలకు పాల్పడే పలు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. దొంగతనాల కేసుల్లో 2018లో ఐదు కోట్ల 92 లక్షల రూపాయలు నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకోగా.. 2019లో తొమ్మిది కోట్ల 69 లక్షల రూపాయల నగదు, నగలు నిందితుల నుంచి రికవరీ చేశారు. గత సంవత్సరం దోపిడీకి వచ్చిన దొంగలు హత్యలు చేయగా, ఈసారి హత్యలు లేని దోపిడీలు మాత్రమే జరిగాయని ఎస్పీ సత్యయేసుబాబు చెప్పారు.

2019లో విశేష ప్రతిభ కనబరిచి, అంకిత భావంతో పనిచేసి కేంద్ర ప్రభుత్వ అవార్డులకు ఎంపికైన 63 మంది పోలీసులకు జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అతి ఉత్కృష్ట పురస్కారాలు, ఉత్కృష్ట సేవాపతకాలు ప్రదానం చేశారు.

అనంతపురం జిల్లా వార్షిక నివేదిక వెల్లడిస్తున్న ఎస్పీ

ఇదీ చదవండి

విశాఖ ఉత్సవ్​లో కలెక్టర్​ దంపతుల గానం అదిరింది..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details