ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలంటూ అనంతపురం జిల్లా గాండ్లపెంట వాసులు నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. గాండ్లపెంట మండలం తుమ్మలబైలు వద్ద ఉన్న కంబాల రాయుడికి... పరిమిత సంఖ్యలో భక్తులు వెళ్లి పూజలు చేశారు. అక్కడే ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికీ పూజలు చేసి... కరోనా నుంచి కాపాడాలని దేవతామూర్తులను వేడుకున్నారు.
కంబాలరాయుడా... కరోనా నుంచి కాపాడయ్యా.. - కరోనా తాజా వార్తలు
కరోనాతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు... దాని బారిన పడకుండా చూడాలంటూ దేవుళ్లను వేడుకుంటున్నారు. అనంతజిల్లా గాండ్లపేట వాసులు... దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.
కంబాలరాయుడా... కరోనా నుంచి కాపాడయ్యా..