జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని అనంతపురం జిల్లా పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. పెనుకొండలోని ఎంపీడీవో కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమావేశమయ్యారు.
జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని కోరుతూ పెనుకొండ ఎంపీడీవో కార్యాలయం వద్ద నుంచి పట్టణంలోని మంత్రి శంకరనారాయణ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి.. మంత్రికి వినతిపత్రం అందజేశారు. జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని కోరారు. రేపటి నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ విధులకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.