ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యసనాలను వదిలి.. సమాజం మెచ్చుకునేలా మారాడు.. అది ఎలాగంటే? - అనంతపురం జిల్లా వార్తలు

Inspirational story: గృహ నిర్మాణ పనులు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్న ఆ యువకుడు వ్యసనాలకు బానిసయ్యాడు. వృత్తిని వదిలి చెడు దారులు పట్టాడు. దీంతో అతడిపై హత్య, హత్యాయత్నం కేసులు సైతం నమోదయ్యాయి. పోలీసులు రౌడీషీట్ తెరవడంతో సమాజం అతన్ని చిన్నచూపు చూసింది. అతడి గురించి తెలిసి ఏ ఒక్కరూ కూడా ఎవ్వరు ఇవ్వలేదు. కానీ కొన్ని రోజుల్లోనే అతన్ని అందరు మెచ్చుకున్నారు. పోలీసులు సైతం అతడిని అభినందించారు. అసలు అతడిలో వచ్చిన మార్పేంటి... ఎందుకు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం అతను ఎం చేస్తున్నాడో తెలుసుకుందాం..

Inspirational story
Inspirational story

By

Published : Jan 2, 2022, 1:31 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వద్దిరెడ్డి భూపాల్‌రెడ్డి భవన నిర్మాణ రంగంలో ఫిల్లర్ డిజైనర్‌గా పని చేసేవారు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అతడిపై హత్య, హత్యాయత్నం కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో సమాజంలో తలెత్తుకోలేక కుమిలిపోయారు. రౌడీ అనే ముద్రను తొలగించుకుని మంచిగా బతకాలనుకున్నారు. గతంలో చేసిన పనికి ఆదరణ లేకపోవడం, తన గురించి తెలిసి పని ఇవ్వకపోవడంతో ఇబ్బందిపడేవాడు.

మ్యూరల్ ఆర్ట్స్‌లో శిక్షణ..

భూపాల్‌రెడ్డి తాడిపత్రి నుంచి హైదరాబాద్‌కు వెళ్లి ఎంఎఫ్ఏ పూర్తి చేసిన సుకుమార్, శ్రీకాంత్‌ను కలిశారు. వారి వద్ద ఏడాది పాటు మ్యూరల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. నాలుగేళ్లుగా బొమ్మలు వేస్తూ అనంతపురం జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని స్థానికులు తెలిపారు. గతంలో నాకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసు అధికారుల ఇళ్లలో బొమ్మలు వేశానని భూపాల్‌రెడ్డి తెలిపారు. ఇంటి లోపల, బయట గోడలపై బొమ్మలు వేసి వాటికి సరైన రంగులు వేసే మ్యూరల్ ఆర్ట్స్‌లో జిల్లాలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Sid Naidu: నాడు పేపర్ బాయ్.. నేడు "పవర్ ఐకాన్"

ABOUT THE AUTHOR

...view details