అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి గ్రామానికి చెందిన మేకల నరేంద్ర రెడ్డి జమ్మూ కాశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వర్తించేవాడు. నాల్గో తేదీన మిత్రుడుతో కలిసి స్వగ్రామానికి బయల్దేరాడు. ప్రయాణం చేస్తున్న సమయంలో జ్వరంతో పాటు, వాంతులు కావడంతో నరేంద్ర మిత్రుడు రైల్వే అధికారులుకు సమాచారం అందించాడు. హుటాహుటిన స్పందించిన రైల్వే సిబ్బంది మహారాష్ట్ర లోని భోపాల్‌లో ప్రథమ చికిత్స అందజేశారు. అనంతరం అదే రైలులో బయలుదేరిన నరేంద్ర కొద్దీ దూరం అలాగే ప్రయాణించాడు. మార్గమధ్యలో మరల సమస్య పునరావృత్తమైంది. ఈసారి బల్లార్‌షా స్టేషన్లో రైలు నిలిపివేసి, చంద్రాపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూనే నరేంద్ర మృతి చెందాడు. ఈదుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సెలవుల్లో ఇంటికి వస్తూ జవాన్ మృతి! - ananthapuram Javan's who worked in jammu khasmir dead in train
దేశ రక్షణలో విధులు ముగించుకొని సరదాగా 60 రోజులపాటు కాలక్షేపం కోసం కుటుంబ సభ్యులతో గడపడానికి ఇంటికి వస్తున్న దేశ సైనికుడును మృత్యువు కబళించి వేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
![సెలవుల్లో ఇంటికి వస్తూ జవాన్ మృతి! Javan's who worked in jammu khasmir dead in train](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5608740-843-5608740-1578283901958.jpg)
సెలవుల్లో ఇంటికి వస్తున్న జవాన్.. మార్గ మధ్యలో మృతి
సెలవుల్లో ఇంటికి వస్తున్న జవాన్.. మార్గ మధ్యలో మృతి
ఇవీ చూడండి...