ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మైదానం ఇవ్వండి... క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం' - Give the playground We give the best results ananthapuram district latest news

అనంతపురం జిల్లా పెనుకొండ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు అంతర్జాతీయ క్రీడల్లో మెరుస్తున్నారు. మండలానికి ఆరు ప్రతిభా అవార్డులు ప్రకటించగా.... ఇందులో ఐదు పురస్కారాలు ఈ పాఠశాలకే రావడం విశేషం. విశాలమైన క్రీడామైదానం కల్పిస్తే మరింతగా రాణిస్తామని అమ్మాయిలు ఆత్మ విశ్వాసంతో చెబుతున్నారు.

ananthapuram girl high school student in International level sports
క్రీడామైదానం ఇవ్వండి... ఉత్తమ ఫలితాలను ఇస్తాం..

By

Published : Dec 19, 2019, 10:44 PM IST

క్రీడామైదానం ఇవ్వండి... ఉత్తమ ఫలితాలను ఇస్తాం..

తమ పాఠశాలకు విశాలమైన క్రీడా మైదానం ఏర్పాటు చేస్తే క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ చాటుతామంటున్నారు విద్యార్థులు. అనంతపురం జిల్లా పెనుకొండ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన బాలికలు ఇప్పటికే పలు అంతర్జాతీయ క్రీడల్లో మెరిశారు. ఈ దిశగా మండలానికి ఆరు ప్రతిభా అవార్డులు ప్రకటించగా.... ఇందులో ఐదు పురస్కారాలు ఈ పాఠశాలకే రావడం విశేషం.

విద్యలోనే కాకుండా ఇక్కడ విద్యార్ధులు క్రీడల్లోనూ సత్తా చాటుతుండడం ఇతర పాఠశాలల విద్యార్థినులకు ఆదర్శంగా నిలుస్తోంది. పెనుగొండ నియోజకవర్గ స్థాయిలో జరిగిన 8 పోటీలకు గాను... అన్ని విభాగాల్లో ప్రతిభ చాటారు. అనంతపురం ఆర్​డీటీ క్రీడా మైదానంలో జరిగిన మినీ గోల్ఫ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థులు మహాలక్ష్మి, పల్లవి ఈ నెల 24న మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇరుకైన క్రీడామైదానం ఉన్నా ఇన్ని విజయాలు సాధించిన విద్యార్థులు విశాలమైన క్రీడామైదానం కల్పించాలని కోరుకుంటున్నారు. ఆ సౌకర్యం వస్తే.. మరింతగా క్రీడల్లో రాణిస్తామంటున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details