ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Tour : ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు.. భారీ బందోబస్తు - ananthapuram district cm tour

ఈ నెల ఎనిమిదో తేదీన సీఎం జగన్... అనంతపురం జిల్లా రాయదుర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ విప్ కాపురామచంద్రారెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు తెలిపారు.

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ఠ బందోబస్తు
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

By

Published : Jul 6, 2021, 7:45 PM IST

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు చేపడుతున్నట్లు ఎస్పీ సత్య యేసుబాబు తెలిపారు. ఎనిమిదో తేదీన రాయదుర్గంకు సీఎం రానున్నందున హెలిప్యాడ్, రూట్ బందోబస్తు, బహిరంగ సభా స్థలాన్ని కలెక్టర్ నాగలక్ష్మి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తో కలిసి పరిశీలించారు.

రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో స్పెషల్ పార్టీలు కూంబింగ్ నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ రాకతో స్థానిక ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details