చర్చి గదుల్లో పార్టీ కార్యాలయాలు వద్దు - latest crime news in thadipathri
అనంతపురం జిల్లా మాలమహానాడు అధ్యక్షురాలు కమలమ్మపై తాడిపత్రి పోలీసులు మూడు వేరు వేరు కేసులను నమోదుచేశారు. పట్టణంలోని ఓ ఆర్‌సీఎం చర్చిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు విషయంలో ఘర్షణకు పాల్పడటం, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన, విలేకరులను దుర్భాషలాడటంపై ఆమెపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తేజమూర్తి తెలిపారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సుంకులమ్మపాలెం కాలనీలోని ఆర్‌సీఎం చర్చి గదుల్లో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు మాలమహానాడు జిల్లా అధ్యక్షురాలు కమలమ్మ ఓ గదిని తీసుకుంటుండగా స్థానిక మహిళలు అభ్యంతరం తెలిపారు. చర్చి వద్ద పార్టీ కార్యకలాపాలు వద్దని ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. తనపై దాడి చేస్తున్నారని పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట కమలమ్మ నిరసన చేపట్టారు. ఈ నిరసన చిత్రీకరిస్తున్న విలేకరులను ఆమె దుర్భాషలాడారు. ఘర్షణకు పాల్పడటం, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన, విలేకరులను దుర్భాషలాడటంపై కమలమ్మపై మూడు వేరు వేరు కేసులు నమోదు చేసినట్లు సీఐ తేజమూర్తి తెలిపారు.