అనంతపురం జిల్లా మడకశిరలో మొదటిసారి ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒకటి, రెండు కేసులు రాగా.. బుధవారం ఒక్కరోజే 14 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైరస్ సోకిన వారిని అధికారులు కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. ప్రజలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే నిత్యావసరాల కోసం బయటకు రావాలని అధికారులు కోరారు. ఇళ్లల్లోనే ఉంటూ వైరస్ వ్యాప్తి నియంత్రణకు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు.
మడకశిరలో ఒక్కరోజే 14 కరోనా కేసులు - మడకశిరలో కరోనా కేసులు
అనంతపురం జిల్లా మడకశిరలో బుధవారం ఒక్కరోజే 14 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉంటూ వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని అధికారులు కోరారు.
మడకశిరలో ఒక్కరోజే 14 కరోనా కేసులు