ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మూమెంట్ రిజిస్టర్​లో పేర్లు లేకపోతే కఠిన చర్యలు..' - గ్రామ సచివాలయం తనిఖీ

అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మికంగా పరిశీలించారు. పని వేళల్లో ఎప్పుడు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మూమెంట్ రిజిస్టర్​లో తప్పకుండా తమ పేర్లను నమోదు చేయాలని.. మూమెంట్ రిజిస్టర్​​లో పేర్లు నమోదు చేయకపోతే అలాంటివారిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

sudden inspection nayinapally village secretariat
అనంతపురం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

By

Published : Dec 22, 2020, 6:40 PM IST

అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే మూమెంట్ రిజిస్టర్​లో తప్పకుండా తమ పేర్లను నమోదు చేయాలని.. మూమెంట్ రిజిస్టర్​లో పేర్లు నమోదు చేయకపోతే అలాంటివారిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామ సచివాలయంలోని రిజిస్టర్​లను తప్పనిసరిగా నిర్వహించాలని.. ఉద్యోగుల వివరాలను నమోదు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు తమ విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించాలన్నారు. గ్రామ సచివాలయంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను, పోస్టర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ఈ సందర్భంగా మూమెంట్ రిజిస్టర్​లో పేర్లు నమోదు చేయకుండా బయటికి వెళ్లిన సచివాలయ ఉద్యోగులకు మెమో జారీ చేయాలని పంచాయతీ సెక్రటరీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మరోసారి ఉద్యోగులు పేరు నమోదు చేయకుండా ఎవరు బయటికి వెళ్లకుండా చూడాలని.. ఎవరైనా పేరు నమోదు చేయకుండా బయటకు వెళితే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details