అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి గ్రామం నుంచి మండల కేంద్రానికి కలెక్టర్ గంధం చంద్రుడు బస్సులో ప్రయాణించారు. గొంచిరెడ్డిపల్లి గ్రామం నుంచి మండల కేంద్రంలో ఉన్న పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు.. జిల్లా కలెక్టర్ గంధం చంద్రునికి విన్నవించారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి..బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. గొంచిరెడ్డిపల్లి గ్రామంలో బస్సు సర్వీసులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అదే బస్సులో ప్రయాణించి మండల కేంద్రం వరకు వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పలు విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణించిన అనంతపురం కలెక్టర్ - విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన అనంతపురం జిల్లా కలెక్టర్
అనంతపురం జిల్లా పాలనాధికారి గంధం చంద్రుడు.. పాఠశాల విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. గొంచిరెడ్డిపల్లి గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు.. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై కలెక్టర్కు తెలపగా.. ఆయన సకాలంలో స్పందించి విద్యార్థులు ప్రయాణించేందుకు బస్సు ఏర్పాటు చేశారు.
పాఠశాల విద్యార్థులో కలిసి బస్సులో ప్రయాణించిన అనంతపురం కలెక్టర్