ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో ఐదు పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడంలేదు: అనంతపురం కలెక్టర్ - panchayat elections latest news

అనంతపురం జిల్లాలో ఐదు పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడంలేదని కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1039 పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కేంద్రంలో సామాగ్రి కోసం వచ్చే సిబ్బందికి అన్ని విధాలా సౌకర్యాలు కల్పించామన్నారు.

ananthapuram colector on election arrangements
అనంతపురం కలెక్టర్

By

Published : Feb 4, 2021, 10:27 PM IST

అనంతపురం జిల్లాలో ఐదు పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించటం లేదని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. రెండు పంచాయతీల్లో కోర్టు ఉత్తర్వుతో, మరో మూడు చోట్ల పాలనాపరమైన నిర్ణయంతో పంచాయతీ ఎన్నికలు నిలుపుదల చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1039 పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తొలివిడత పోలింగ్​కు ఎన్నికల సామాగ్రిని రేపటి నుంచి సిబ్బందితో మండల కేంద్రాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో సామాగ్రి కోసం వచ్చే సిబ్బందికి అన్ని విధాలా సౌకర్యాలు కల్పన చేశామన్నారు. రెండో విడతలో పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నామని, ఎవరినీ ఒత్తిడి చేయకుండా స్వచ్ఛందంగా వచ్చిన వారికే వ్యాక్సిన్ ఇస్తామన్నారు.

కళ్యాణదుర్గం చెక్ పోస్ట్ పరిశీలన:

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కళ్యాణదుర్గంలో నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. నామినేషన్ పత్రాలు స్వీకరించే కౌంటర్లలో వసతుల గురించి అభ్యర్థులను ఆరా తీశారు. ఎన్ని నామినేషన్లు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాల్మీకి సర్కిల్ లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్​ను గురువారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోకి వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని.. పోలీసులను, అధికారులను ఆయన ఆదేశించారు.

ఇదీ చదవండి:హిందూపురం వైకాపాలో తారాస్థాయికి వర్గ విభేదాలు

ABOUT THE AUTHOR

...view details