అనంతపురం జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో బుధవారం ఎన్నికలు సజావుగా జరగడానికి అందరూ సహకరించాలని.. ఎస్పీ సత్యఏసుబాబు కోరారు. గుంతకల్లులోని పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల లెక్కింపు జరిగే రాధాకృష్ణన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల గదులను ఆయన పరిశీలించారు. ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడే వారిని జిల్లాలో 3వేల మందిని గుర్తించామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, పోలింగ్ రోజున సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఆయన డీఎస్పీ షర్ఫుద్దీన్, సీఐలతో శాంతిభద్రతలపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, తహసీల్దార్ రాములుతో చర్చించారు.
ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలి
అనంతపురం జిల్లాలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైనట్లు.. జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు తెలిపారు. ఎన్నికలు సజావుగా జరగడానికి జిల్లా ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలి
TAGGED:
guntakallu latest news