అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఒంటారెడ్డిపల్లి గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున ఈదురుగాలులలో భారీ వర్షం కురిసింది. వందలాది బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. మామిడి కాయలు భారీగా రాలిపోయాయి. గ్రామ పరిధిలోని విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అకాల వర్షంతో ఎంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.
ఈదురుగాలుల విధ్వంసం.. పండ్ల తోటలు ధ్వంసం - అనంతపురంలో బొప్పాయి రైతుల కష్టం
అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఒంటారెడ్డిపల్లి గ్రామంలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పండ్లు సాగు చేసిన రైతులు నష్టపోయారు. బొప్పాయి చెట్లు నెలకొరిగాయి.

బొప్పాయి పంట ధ్వంసం