ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వినియోగంపై సమీక్ష - ఆక్సిజన్ వినియోగంపై అనంతపురం జాయింట్ కలెక్టర్ల సమావేశం

అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వినియోగంపై.. జిల్లా జాయింట్ కలెక్టర్లు సిరి, నిశాంత్ కుమార్.. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం, నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు స్పష్టత ఇవ్వాలని.. ఆదేశాలు జారీ చేశారు.

anantahpur joint collectors meeting
anantahpur joint collectors meeting

By

Published : May 8, 2021, 4:26 PM IST

అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు స్పష్టత ఇవ్వాలని.. జిల్లా జాయింట్ కలెక్టర్లు సిరి, నిశాంత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో.. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం, నోడల్ అధికారులతో.. వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులకు సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉందని.. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఎందుకు ఏర్పడుతుందో చెప్పాలని ప్రశ్నించారు.

తాజా సమాచారం అందించాలి

ప్రతి ఆస్పత్రిలో ఎంత మంది బాధితులు ఉన్నారు, ఎన్ని పడకలు ఉన్నాయి, ఆక్సిజన్ అవసరం ఉన్న పడకలు ఎన్ని అనే అంశాలను నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. కొన్ని ఆస్పత్రుల్లో.. బాధితులు తక్కువగా ఉన్నా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ వాడకం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆక్సిజన్ విషయంలో బ్లాక్ మార్కెట్ లో సరఫరా అవుతున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతమైతే.. ఆ ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రుల పక్కా సమాచారాన్ని.. నోడల్ అధికారులు తమకు ఎప్పటికప్పుడు అందించాలని తెలిపారు.

ఇదీ చదవండి:

త్వరలోనే కొవిడ్‌ కేంద్రాల్లోనూ ఆక్సిజన్‌ సౌకర్యం: మంత్రి ఆళ్ల నాని

ABOUT THE AUTHOR

...view details