అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో గుట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జగదీష్ బాబు ఆధ్వర్యంలో పాఠశాలలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఏఎన్ఎం, నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు గుర్తించి పెనుకొండ వైద్యశాలకు తరలించారు.
ఆసుపత్రి పాలైన గురుకుల పాఠశాల విద్యార్థినులు - ఆసుపత్రి పాలైన అనంతపురం గురుకుల పాఠశాల విద్యార్థినులు
అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు.
పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉండటం, హాస్టల్ గదుల కిటికీలకు దోమలు రాకుండా ఏర్పాటు చేసిన మెష్‌లు పాడవటంతో విద్యార్థులు దోమకాటుకు గురై ఆసుపత్రి పాలవుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పాఠశాల ఆవరణను శుభ్రపరచాలని, దోమలు రాకుండా ఉండటానికి మెష్‌లు ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: విద్యార్థుల కోసం.. ఉపాధ్యాయురాలి వినూత్న ప్రయత్నం