అనంతపురం జిల్లా తనకల్లు మండలం రాసినేపల్లిలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు జయరామ్ కుటుంబ సభ్యులను డివిజనల్ స్థాయి అధికారులు పరామర్శించారు. ఆర్డీఓ వెంకట్ రెడ్డి, డీఎస్పీ భవ్య కిషోర్, వ్యవసాయ శాఖ ఏడీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
కుటుంబ స్థితిగతులు, భూముల వివరాలను ఉన్నతాధికారులకు తెలిపి.. సహాయం అందేలా చూస్తామని భరోసా కల్పించారు. రైతు జయరాం అప్పుల బాధతో రెండు నెలల కిందట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.