కళ్ల ముందే కష్టార్జితం కనిపిస్తోంది.. ఫలితం దక్కే దారి కనిపించక కన్నీళ్లు వస్తున్నాయి. దాదాపు 2 వేల క్వింటాళ్ల వరకు పొలాల్లో నిల్వలు పేరుకుపోయాయి. కొనేవారు లేరని వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. మార్కెట్లో కిలో రూ.30 ఉన్నప్పటికీ మమ్మల్ని మాత్రం కిలో రూ.8కే వ్యాపారులు అడుగుతున్నారని ఉల్లి రైతులు కన్నీరు పెడుతున్నారు.అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన ఖాసీం సాబ్, హాజీసాబ్, నాగేంద్రప్ప , బడే సాబ్, పీరా తదితరులు ఉల్లిసాగు చేశారు. దిగుబడి అమ్ముకోలేక దీనంగా చూస్తున్నారు. ఈ పరిస్థితిపై ఉద్యానశాఖ అధికారి దస్తగిరి దృష్టికి తీసుకెళ్లగా రైతులు ఆత్రుతపడి ఎక్కడి పడితే అక్కడ అమ్ముకోరాదు, మున్ముందు ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకోవాలన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఉల్లికి కన్నీరు తెప్పిస్తున్న కరోనా.. దిక్కుతోచని స్థితిలో రైతన్న - latest news on onion farmers
ఉల్లి పంట దండిగా వచ్చింది.. ఈ సారి అప్పుల బాధ తీరి.. కష్టాల సాగరం నుంచి బయటపడతామని కలలు కన్నారా రైతులు. ఈ సారి వర్షం వచ్చి పంట నాశనం చేయలేదు... పురుగు పట్టి పీడించలేదు... కరోనా మహమ్మారి వచ్చి వారిని నట్టేట ముంచింది. వచ్చిన ఉల్లి పంటను అమ్ముకోలోక దిక్కుతోచని స్థితిలో చూస్తున్నారా రైతన్నలు.

అనంతపురంలో ఉల్లి రైతుల కష్టాలు