"కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే... మీరు రోడ్లపై చక్కర్లు కొట్టడం ఏంటి?" అంటూ అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్డీవో మధుసూదన్ ప్రజలను ప్రశ్నించారు. ధర్మవరంలో లాక్ డౌన్లో భాగంగా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు చేసినా... పెడచెవిన పెట్టి రోడ్లపైకి రావటంపై ఆగ్రహించారు. జిల్లాలోని పొట్టిశ్రీరాములు కూడలి వద్ద వాహన చోదకులను ఆపి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
ద్విచక్ర వాహనదారులపై ధర్మవరం ఆర్డీవో ఆగ్రహం - dharmavaram news
అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్డీవో మధుసూదన్.. ద్విచక్ర వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నా కూడా రోడ్లపై చక్కర్లు కొడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
![ద్విచక్ర వాహనదారులపై ధర్మవరం ఆర్డీవో ఆగ్రహం dharmavaram rdo fires on motorists for roaming on roads](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6522639-388-6522639-1585024193956.jpg)
ద్విచక్ర వాహనదారులపై ధర్మవరం ఆర్డీవో ఫైర్