ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం' - అనంతపురంలో కరోనా ఆసుపత్రుల వసతులు

అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ ఆసుపత్రిలో కలెక్టర్ గంధం చంద్రుడు పర్యటించారు. రోగులకు అందుతున్న చికిత్స, సౌకర్యాలపై ఆరా తీశారు.

ananthapur district collector visit covid hospitals in city
ananthapur district collector visit covid hospitals in city

By

Published : May 1, 2021, 2:01 PM IST

ఆసుపత్రిలో చేరిన కొవిడ్ బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ, క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య చికిత్సపై కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆరా తీశారు. శుక్రవారం అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయన పర్యటించారు. రోగులతో నేరుగా మాట్లాడారు.

క్యాన్సర్‌ ఆస్పత్రిలో 20, సూపర్‌ స్పెషాలిటీలో 16 చొప్పున ఐసీయూ పడకలను నెలకొల్పామని కలెక్టర్‌ తెలిపారు. రెండు ఆసుపత్రుల్లో అదనంగా మరో 120 సాధారణ పడకలు అందుబాటులోకి రానున్నాయన్నారు. అదనపు సౌకర్యాలు కూడా కల్పించాలని ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి, నగర కమిషనర్‌ మూర్తిని ఆదేశించారు. ఆయన వెంట సర్వజనాస్పత్రి వైద్య పర్యవేక్షకుడు ఆచార్య వెంకటేశ్వర్‌రావు, ఆర్‌ఎంఓ డాక్టర్‌ శివకుమార్‌, ఔషధ తనిఖీ అధికారి, నోడల్‌ అధికారి రమేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి: అమరరాజా బ్యాటరీస్‌కు ఏపీపీసీబీ నోటీసులు.. ఆ ప్లాంట్లు మూసేయాలని ఆదేశం

ABOUT THE AUTHOR

...view details