అనంతపురం జిల్లాలో బత్తాయి రైతుల సమస్యలపై ఈటీవీ భారత్ కథనానికి కలెక్టర్ గంధం చంద్రుడు స్పందించారు. పంట కొనేవాళ్లు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు చర్యలు ప్రారంభించారు. రైతుల కోరిక మేరకు కర్నూలు జిల్లా సిరివెళ్ల వ్యాపారులకు పంట కొనేందుకు అనుమతించారు. వారు ప్రయాణించేందుకు వీలుగా పాసులు జారీ చేశారు. అనంతపురం జిల్లా వచ్చి బత్తాయి కొనుగోలు చేయాలని సూచించారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: బత్తాయి వ్యాపారులకు కలెక్టర్ అనుమతి - అనంతపురం బత్తాయి రైతుల కష్టాలు
అనంతపురం జిల్లాలో బత్తాయి రైతులను ఆదుకునేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా నుంచి బత్తాయి పంటను కొనేందుకు... వ్యాపారులకు కలెక్టర్ పాసులు జారీ చేశారు.
బత్తాయి రైతుల సమస్యలపై కలెక్టర్ స్పందన