అనంతపురంలోని తన నివాసంలో కలెక్టర్ గంధం చంద్రుడు ఫ్రెండ్స్ టు సపోర్ట్ ఓ.ఆర్.జి (friends2support.org) వెబ్ సైట్ పోస్టర్లను విడుదల చేశారు. కరోనా బాధితులు వైరస్ నుంచి బయటపడేందుకు ఆ వైరస్ నుంచి కోలుకున్నవారు తమవంతు బాధ్యతగా ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానం చేయాలనుకునేవారు ఈ వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలని తెలిపారు. వీలున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
'ప్లాస్మా దానం చేయండి..కరోనా జయించేలా చేయండి' - friends2support.org latest news
ఫ్రెండ్స్ టు సపోర్ట్ ఓ.ఆర్.జి అనే వెబ్సైట్ పోస్ట్‌ర్‌ను అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విడుదల చేశారు. కరోనా జయించి ప్లాస్మా దానం చేయాలనుకునేవారు ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలని కోరారు.

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు