ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

3264 పొగాకు ప్యాకెట్లు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ - అక్రమంగా తరలిస్తున్న పొగాకు ఉత్పత్తుల పట్టివేత

పొగాకు ఉత్పత్తుల తరలింపును అనంతపురం జిల్లా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.26 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

illegal tobacco
పోలీసులకు పట్టుబడ్డ పొగాకు ఉత్పత్తులు

By

Published : Dec 20, 2020, 11:24 AM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌరీపురం గ్రామం వద్ద రాష్ట్ర సరిహద్దు పోలీస్ చెక్ పోస్ట్​ తనిఖీలో పొగాకు ఉత్పత్తులు పట్టుబడ్డాయి. పావగడ నుంచి శిర ప్రాంతానికి ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు బస్సులో.. ఈ ఉత్పత్తులను పోలీసులు గుర్తించారు.

నాలుగు ప్లాస్టిక్ సంచుల్లో 26 వేల రూపాయల విలువ చేసే 3264 పాకెట్ల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్, క్లీనర్​లను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details