ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కలిసి రాని అమ్మకం.. మొన్న కరోనా.. ఇప్పుడు వర్షం

By

Published : Apr 30, 2020, 8:47 AM IST

మొన్నటి వరకు లాక్​డౌన్​తో బత్తాయి రైతులు పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడ్డారు. వారి సమస్యలపై అధికారులు స్పందించి.. మార్కెటింగ్​కు కావాల్సిన అవకాశాలు కల్పించారు. అమ్మకాలు ఊపందుకున్నాయనుకున్న సమయంలో... వరణుడు వారిపై ఉరిమాడు.

ananthapur bathai farmers difficulties
తడిసిన బత్తాయి పంట

అనంత వ్యవసాయ మార్కెట్‌యార్డులో కొన్నిరోజులుగా బత్తాయి అమ్మకానికి వీలు కల్పించారు. నాలుగైదు రోజుల నుంచి కాయలు కొద్దిగానే వస్తున్నాయి. బుధవారం 200 టన్నులు రాగా.. రాత్రి భారీ వర్షం కురిసి కాయల రాశుల మధ్య నీరు చేరింది. వేలం ఆలస్యంగా మొదలైనా టన్ను రూ.6,500-రూ.10,500 పలికింది. అయితే... వాన నీటిలో ఉత్పత్తులున్నాయి. కాయలు కుళ్లి 10-15 శాతం నష్టం జరిగే వీలుంది. ధర తగ్గించుకోవాల్సిందే. తరుగు ఇవ్వాల్సిందే. లేకపోతే కొనమని వ్యాపారులు చెప్పారు. చేసేదేమీ లేక అయిన కాడికి రైతులు కాయలు అమ్ముకున్నారు. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలి.

ABOUT THE AUTHOR

...view details