అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి గత ఐదేళ్లలో తెదేపా అభ్యర్థి ప్రభాకర్ చౌదరి ఎంతగానో కృషి చేశారని స్వర్గీయ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి చౌదరిని గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రాభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. తెదేపా మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ... ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అనంత అభివృద్ధికి.. చౌదరి ఎంతో కృషి చేశారు: రామకృష్ణ - ananthapuram
గత ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి కోసం తెదేపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని నందమూరి రామకృష్ణ వ్యాఖ్యానించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి ప్రభాకర్ చౌదరితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నందమూరి రామకృష్ణ ఎన్నికల ప్రచారం