ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'క్వారంటైన్​లో అయినా ఉంటాం.. మమ్మల్ని కాశీ నుంచి తీసుకెళ్లండి' - కాశీలో చిక్కుకున్న అనంతపురం జిల్లా వాసులు

దైవ దర్శనం కోసం కాశీకి వెళ్లారు. లాక్​డౌన్​లో చిక్కుకుని.. సొంతగూటికి చేరుకోలేక ఇబ్బంది పడుతున్నారు. తమను స్వస్థలాలకు చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

anantapurm district people struck in kasi at uttarpradesh
కాశీలో చిక్కుకున్న అనంతపురం జిల్లా వాసులు

By

Published : Apr 26, 2020, 8:00 PM IST

కాశీలో చిక్కుకున్న అనంతపురం జిల్లా వాసులు

అనంతపురం జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన కొందరు భక్తులు.. ఉత్తరప్రదేశ్​లో చిక్కుకుపోయారు. నెలన్నర నుంచి ఊరు కాని ఊరిలో ఇబ్బందులు పడుతున్నారు. సొంత ప్రాంతాలకు చేరుకోలేక సతమతమవుతున్నారు. యాడికి, పెద్దపప్పూరు మండలాల నుంచి గత నెల 12న కాశీ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లాక్ డౌన్ కారణంగా ఉత్తరప్రదేశ్​లోని గోరఖ్ పూర్​లో చిక్కుకుపోయారు. అక్కడి రైల్వేస్టేషన్​కు ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో అందరూ తలదాచుకుంటున్నారు.

నెలన్నరగా కుటుంబాలకు దూరంగా ఉంటున్న వీరికి... యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ చేసిన ప్రకటన ఆశలు రేపుతోంది. ఏపీ ప్రభుత్వం స్పందిస్తే వీరిని పంపటానికి చర్యలు తీసుకుంటామని ఆయన పత్రికాముఖంగా ప్రకటించారు. సదరు పత్రికా ప్రకటనను తమ బంధువులకు, నాయకులకు వాట్సాప్​లో పంపుతూ... తమను స్వస్థలాలకు చేర్చేలా చూడాలని బాధితులు వేడుకుంటున్నారు. తమలో ఎలాంటి రోగ లక్షణాలు లేవనీ.... ఏపీకి వచ్చాక క్వారంటైన్లో ఉండటానికి కూడా సిద్ధమేనని వారు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details