సూక్ష్మరూప కళాకృతులను తీర్చిదిద్దడానికి కృషితో పాటు ఓర్పు ఎంతో అవసరం. పెన్సిల్ లెడ్లపై ఆకృతులు వేయడం అనేది అంత సులభమైన వ్యవహారం కాదు. అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన పుటకాల రాజేష్ అనే ప్రైవేట్ సంస్థ ఉపాధ్యాయుడు మాత్రం.. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే పెన్సిళ్లపై సూక్ష్మ కళాకృతులకు ప్రాణం పోస్తున్నాడు. 2014లో ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ కళాకారుడి ద్వారా దీనిపై అవగాహన పెంచుకున్న రాజేష్.. ఇప్పుడు పెన్సిళ్లపై అద్భుతమైన కళాఖండాలకు రూపాన్ని ఇస్తున్నాడు. అతి తక్కువ సమయంలోనే కళాకృతులకు ప్రాణం పోస్తున్నాడు.
ఇదీ రాజేష్ నేపథ్యం..
అనంతపురం నగరంలోని రాజీవ్ నగర్‌కు చెందిన రాజేష్.. 2018లో బీకాం పూర్తి చేశాడు తరువాత స్థానికంగా ఉండే ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. విధులు నిర్వహిస్తూనే సూక్ష్మ కళపై దృష్టి సారించాడు. మొదట్లో పెన్సిల్ లెడ్‌పై వ్యక్తుల పేర్లు, చిన్న చిన్న ఆకృతులు వేయడం సాధన చేశాడు. తరువాత ప్రత్యేక రోజుల విశిష్టతను తెలియజేస్తూ ఆకృతులు రూపొందించడం మొదలుపెట్టాడు. రాజేష్ రూపొందించిన వాటిలో వివిధ దేవతా రూపాలు, అమ్మ నాన్న చేతులను పట్టుకున్న పిల్లాడి రూపాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్థానికంగా వీటికి మంచి ఆదరణ లభించడంతో.. కళాకృతులను విక్రయించడమూ ప్రారంభించాడు. ఒక్కో ఆకృతినీ రూ. 200 నుంచి రూ. 500 చొప్పున విక్రయిస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నట్లు చెబుతున్నాడు.
ప్రపంచ రికార్డు దాసోహం..