అనంతపురం జిల్లా హిందూపురం మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సబ్ కలెక్టర్ నిశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా ప్రిన్సిపాల్‌ను నియమించాలని.. సమస్యలు పరిష్కరించాలని వారం రోజులుగా విద్యార్థులు నిరసన చేస్తున్న నేపథ్యంలో సబ్ కలెక్టర్ కళాశాలకు వచ్చారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సబ్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బోధనా సిబ్బందితో పాటు కళాశాల ప్రిన్సిపాల్‌ని విచారించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.