అనంతపురం జిల్లా గుంతకల్లులో లాక్డౌన్ నిర్వహణను ఎస్పీ సత్య ఏసుబాబు స్వయంగా పరిశీలించారు. రైల్వే కాలనీ, ప్రధాన రహదారులు, చెక్‌పోస్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సత్య ఏసుబాబు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో గుంతకల్లును తనిఖీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు లాక్డౌన్ ఉల్లంఘించిన 200 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
'విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచాం' - 'విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచాం'
అనంతపురం ఎస్పీ సత్య ఏసుబాబు గుంతకల్లులో పర్యటించారు. పట్టణంలో లాక్డౌన్ అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించారు.
గుంతకల్లులో పర్యటించిన ఎస్పీ సత్య ఏసుబాబు
ఉదయం 6 గంటల నుంచి, మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచినట్లు వివరించారు. వారంతా ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించి, కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సాయపడాలని సూచించారు.