ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం: ఎస్పీ - భద్రతా ఏర్పట్లపై అనంతపురం ఎస్పీ

అనంతపురం జిల్లావ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతగా జరిపేందుకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్టు ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. ఘర్షణలు జరగకుండా కొందరిని గుర్తించి ముందస్తుగానే నిఘా ఉంచామన్నారు.

anantapuram sp on election security preparations
ఎన్నకల భద్రతకు ముందస్తు ఏర్పాట్లు: ఎస్పీ

By

Published : Feb 6, 2021, 3:55 PM IST

అనంతపురం జిల్లాలో ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. ముందస్తుగా బైండోవర్ కేసులు పెట్టి ప్రతి మండలంలో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

గతంలో ఎన్నికల్లో జరిగిన ఘర్షణల్లో ప్రధాన కారకులను గుర్తించి.. వాళ్లందరిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. జిల్లాలోని 63 మండలాల్లోని 83 పోలీస్ స్టేషన్ల పరిధిలో షాడో టీంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారంతో భద్రత కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లను ఎస్పీ పర్యవేక్షించారు.

ABOUT THE AUTHOR

...view details