అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఏడు మందిని అనంతపురం 4వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక సరిహద్దులోని చెలికెర, బసాపురం నుంచి మద్యం టెట్రాప్యాకెట్లు కొనుగోలు చేసి.. రెండు వాహనాల్లో తరలిస్తున్నారని.. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో అక్రమంగా తరలిస్తున్న నాలుగు లక్షల రూపాయల విలువైన కర్ణాటక మద్యాన్ని గుర్తించినట్లు సీఐ తెలిపారు. ఏడుగురిని అదుపులోకి తీసుకోగా.. వారిలో ఒకరు మైనర్ ఉండటంతో.. జువెనైల్ కోర్టుకుకు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 92 వేల నగదుతో పాటు రెండు వాహనాలు, ఏడు సెల్ ఫోన్లు, 4లక్షల రూపాయలు విలువైన 9,120 టెట్రా మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
4 లక్షలు విలువైన కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు.. ఏడుగురు అరెస్టు - అనంతపురంలో అక్రమంగా కర్ణాటక మద్యం రవాణా వార్తలు
కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఏడుగురిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ ఉండటంతో జువైనల్ కోర్టుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 4 లక్షల విలువైన కర్ణాటక మద్యంతోపాటుగా.. 92వేల నగదు, రెండు వాహనాలు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
కర్ణాటక మద్యం పట్టివేత