ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్

అనంతపురం జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి నుంచి రక్షించుకోడానికి చర్యలు చేపడుతున్నారు. పలు గ్రామాల్లో ప్రజలు ఇతర గ్రామాల వారు రాకుండా ప్రధాన రహదారికి అడ్డంగా కంపచెట్లు వేశారు.

Anantapuram district-wide lockdown
అనంతపురం జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్

By

Published : Mar 26, 2020, 8:19 PM IST

అనంతపురం జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.

వేపరాలలో..

వేపరాలలో లాక్​డౌన్

కరోనా వైరస్ మహమ్మారి నుంచి రక్షించుకోడానికి గ్రామ ప్రజలు అందరూ ఏకమై ఇతర గ్రామాల వారు రాకుండా ప్రధాన రహదారికి అడ్డంగా కంపచెట్లు వేసి రక్షణ చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లా వేపరాల గ్రామంలో కల్యాణదుర్గం - కనేకల్లు ప్రధాన రహదారిని కంపచెట్లు అడ్డంగా వేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు.

అనంతపురంలో..

అనంతపురంలో లాక్​డౌన్

అనంతపురం నగరంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులు రెండు రోజులుగా సమీక్షలు నిర్వహిస్తూ.. వైరస్ నగరంలోకి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కార్మికులతో కలిసి పలు కాలనీల్లో మందు చల్లారు. అనంతపురంలో రెండు చోట్ల మాత్రమే పెట్రోల్ బంకులను తెరవటానికి అనుమతించగా.. వాహనదారులు అక్కడ బారులు తీరారు.

కల్యాణదుర్గంలో..

కళ్యాణదుర్గంలో లాక్​డౌన్

కరోనా నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దిన మార్కెట్​ను విశాలమైన ప్రదేశానికి తరలించారు. పట్టణ శివార్లలో విశాలంగా ఉన్న మార్కెట్ యార్డులోకి కూరగాయలు నిత్యావసరాల దుకాణాలన్నీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన తరలించారు. ఈ దుకాణాల ముందు సామాజిక దూరం పాటించేందుకు మార్కింగ్ కూడా అధికారులు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ, స్థానిక రెవెన్యూ, పోలీసులు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారు.

ఓబిగానిపల్లిలో...

ఓబిగానిపల్లిలో లాక్​డౌన్

కంబదూరు మండలంలో ఓబిగానిపల్లి కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో గ్రామస్థులు రహదారి నిర్బంధించారు. కర్ణాటక నుంచి వచ్చే వాహనాల్లో తమ ఊరిలో తిరగకుండా ఉండేందుకు ముళ్లకంపలు వేశామని గ్రామస్థులు తెలిపారు.

పెద్దరెడ్డిపల్లిలో...

పెద్దరెడ్డిపల్లిలో లాక్​డౌన్

సోమందేపల్లి మండలంలోని పెద్దరెడ్డిపల్లిలో కల్లు దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై వెంకటరమణ దుకాణాలను సీజ్ చేశారు. ప్రజలు ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదని ఎస్సై చెప్పారు. కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి కల్లు తాగడానికి వచ్చిన వారిని పంపించారు.

ఇదీ చూడండి:

జిల్లాలో వ్యాప్తంగా లాక్ డౌన్... కఠినంగా అమలు

ABOUT THE AUTHOR

...view details