అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం వి. కొత్తకోటకు చెందిన ఓ వలస కూలీకి కరోనా పాజిటివ్ నమోదవడంతో... ఈ మండలంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. ముంబయికి వెళ్లిన వలస కూలీలు స్వస్థలాలకు వస్తుండటంతో ఈ సమస్య తలెత్తుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కూలీలు రాకుండా నియంత్రించడానికి ముంబయి పోలీసులతో చర్చలు చేస్తున్నామన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా వస్తే క్వారంటైన్‌కు తరలించడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వలస కూలీలను రవాణా చేసే వాహనాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు.
ఆ మండలంపై దృష్టి సారించండి - అనంతపురం జిల్లా కరోనా కేసులు
అనంతపురం జిల్లా విడపనకల్లులో ఓ వలస కూలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఫలితంగా అధికారులు ఈ మండలంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కొత్తకోటలో సమావేశం నిర్వహించిన అనంతపురం జిల్లా ఎస్పీ