అనంతపురం జిల్లా మడకశిరలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో రికార్డులను డిప్యూటీ కలెక్టర్ నిశాంత్ రెడ్డి తనిఖీ చేశారు. ఐసీడీఎస్ ఆర్జేడీ ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టినట్లు వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్టు పరిధిలోని 18 సెక్టార్లకు చెందిన పలు దస్త్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార వివరాల గురించి అధికారులను డిప్యూటీ కలెక్టర్ ప్రశ్నించారు. రికార్డుల పరిశీలన నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఐసీడీఎస్ కార్యాలయంలో రికార్డుల తనిఖీ - ఐసీడీఎస్ ఆర్జేడీ ఆదేశాల మేరకు మడకశిర కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ రికార్డుల తనిఖీ
ఐసీడీఎస్ ఆర్జేడీ ఆదేశాల మేరకు.. అనంతపురం జిల్లా మడకశిరలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని డిప్యూటీ కలెక్టర్ నిశాంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడి రికార్డులను తనిఖీ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు చెప్పారు.
మడకశిర ఐసీడీఎస్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ రికార్డుల తనిఖీ