ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఐడీ అదుపులో ఈబిడ్‌ నిందితుడు.. 21 వరకు రిమాండ్ - crime news

అధిక వడ్డీల ఆశచూపి మోసం చేసిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం కోర్టు అతనికి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది.

అధిక వడ్డీ అంటూ రూ. 300 కోట్లు స్వాహా
అధిక వడ్డీ అంటూ రూ. 300 కోట్లు స్వాహా

By

Published : Sep 7, 2021, 4:21 PM IST

ఈబిడ్‌ సంస్థ కేసులో ప్రధాన నిందితుడైన కడియాల సునీల్‌ ను నాగపూర్ సబ్ జైలు నుంచి పి.టి వారెంట్ పై సీఐడీ అధికారులు అనంతపురానికి తీసుకొచ్చారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు సునీల్ ను ప్రవేశ పెట్టారు. ఉదయం నుంచి అనంతపురంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ జరిపి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు తీర్పును వెలువరించింది.

రూ. లక్షకు.. రూ. 30 వేలు వడ్డీ ఇస్తానని ఆశచూపి వందలాది మందిని మోసం చేశాడు. ఈ కేసులో 21 వరకు నిందితుడికి అనంతపురం కోర్టు రిమాండ్ విధించగా.. సీఐడీ అధికారులు రిమాండ్ కు తరలించారు. సుమారు రూ. 300 కోట్ల మేర మోసం జరిగినట్లు ఆరోపణలున్నాయి. గత నాలుగు నెలలుగా నిందితుడు సునీల్ అజ్ఞాతంలో ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details