ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయాల్లో అనంతపురం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు గుడిబండ సచివాలయం తనిఖీ

సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మడకశిర మండలంలోని కదిరేపల్లి, గుడిబండ మండల కేంద్రంలోని 1వ గ్రామ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఎప్పటికప్పుడు ప్రజల అభ్యర్థనలు పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.

collector visit village secretariates
సచివాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ గంధం చంద్రుడు

By

Published : Jan 2, 2021, 10:41 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని కదిరేపల్లితో పాటు గుడిబండ మండల కేంద్రంలోని 1వ గ్రామ సచివాలయాన్ని.. కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గూగుల్ మ్యాప్​లో గుడిబండ 1 సచివాలయాన్ని మ్యాపింగ్ చేశారా లేదా అని ఆరా తీసి.. రిజిస్టర్​లను పరిశీలించారు.

సచివాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు సచివాలయం ద్వారా ఎన్ని అభ్యర్థనలు వచ్చాయి, ఎన్నింటికి పరిష్కారం చూపించారు అని అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్కటీ పెండింగ్​లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details