అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు...వైకాపా నాయకుడు జయరామిరెడ్డి ఓ గుత్తేదారుపై బెదిరింపులకు దిగారు. రాయదుర్గం - కనేకల్ రహదారి పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా పనులేలా చేస్తారని గుత్తేదారుపై మాటలతో దాడికి దిగారు. పనులు ఆపకపోతే భౌతిక దాడులకు తప్పవని బెదిరించారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి ..14 కిలోమీటర్ల వరకు రహదారి నిర్మాణ పనులకు ఆమోదం తెలిపారు. నిర్మాణ పనులకు 17 కోట్ల రూపాయలు కూడా మంజూరయ్యాయి. డీఎంసీ సంస్థ కాంట్రాక్టును సొంత చేసుకుని పనులు చేపట్టింది. అయితే..స్థానిక ఎమ్మెల్యేను అడగకుండా పనులు చేపట్టడం ఏంటని..వైకాపా నేత జయరామిరెడ్డి గుత్తేదారుపై బెదిరింపులకు దిగారు.