కరోనా వైరస్‌ను అరికట్టేందుకు లైట్స్ ఫర్ నేషన్ కార్యక్రమంలో గ్రామస్థులు సైతం పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో పొలికి, గుంతకల్లు, గుత్తి గ్రామస్థులు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు, టార్చి లైట్లు వెలిగించారు. గో కరోనా అంటూ చిన్నారులు నినాదాలు చేశారు. గుంతకల్లు పట్టణంలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులతో దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు.
టీపీఆర్ ట్రస్ట్‌కు చెందిన పరుశురాం దాదాపు 3000 కొవ్వొత్తులను భారతదేశ చిత్రపట ఆకారంలో మైదానంలో మహిళలచేత వెలుగించారు.