అనంతపురం నగరంలో ఆదివారం నుంచి లాక్డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఫలితంగా మద్యం ప్రియులకు కష్టాలు మొదలయ్యాయి. లాక్డౌన్ కారణంగా నగరంలో దుకాణాలు, వ్యాపార సముదాయాలకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మద్యం దుకాణాలను చాలా వరకు మూసివేశారు. ఈ కారణంగా నగరానికి సమీపంలో ఉన్న రాప్తాడు వద్దకు మందుబాబులు క్యూ కట్టారు. రాప్తాడులోని మద్యం దుకాణం వద్ద ఉదయం నుంచి భారీ క్యూలైన్ కనిపించింది. అక్కడికి వచ్చినవారంతా అనంతపురం నగర వాసులేనని స్థానికులు చెబుతున్నారు.
మద్యం కోసం అనంతపురం నుంచి రాప్తాడుకు..! - lock down in anatapura latest news
అనంతపురంలో ఆదివారం నుంచి లాక్డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ కారణంగా మద్యం ప్రియులకు కష్టాలు మొదలయ్యాయి. మద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఫలితంగా మద్యం దుకాణాలు తెరిచి ఉన్న ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు.
అనంతపురంలో లాక్డౌన్