ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: పార్థసారథి - ఏపీ హైకోర్టు ఎన్నికల కమిషన్ తీర్పు

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని అనంతపురం తెదేపా నేత పార్థసారథి అన్నారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన ప్రభుత్వ తీరులో మార్పు రావటంలేదని విమర్శించారు. ​

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు : పార్థసారథి
హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు : పార్థసారథి

By

Published : May 29, 2020, 3:37 PM IST

ఎస్​ఈసీ రమేశ్ కుమార్ తొలగింపు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కోర్టులు, తీర్పులంటే లెక్కలేని తనం ఉందన్నారు. నిమ్మగడ్డను ఎస్ఈసీగా కొనసాగించాలనే కోర్టు తీర్పుతోనైనా సీఎం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.

వైకాపా పాలనపై కోర్టు ఎప్పటికప్పుడు మొట్టికాయలు వేస్తుందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే తెలుగు మాధ్యమం కొనసాగింపు, ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపాను పోలిన రంగుల వ్యవహారంపై కోర్టు చివాట్లు పెట్టిన... ప్రభుత్వ తీరులో మార్పు రాలేదని పార్థసారథి వ్యాఖ్యానించారు..

ఇదీ చదవండి :హైకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ పదవిలోకి వచ్చా: నిమ్మగడ్డ

ABOUT THE AUTHOR

...view details