Taxi Driver Viral Video On Taxes: ఇటు వాహనమిత్ర డబ్బులిస్తూ మరోవైపు.. అటు అధిక పన్నులతో నడ్డివిరుస్తున్నారంటూ అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఓ వాహన యజమాని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో హల్ చల్ చేస్తోంది.
కిరాయి కోసం గుంతకల్లు నుంచి కర్నూలు జిల్లా వెళ్లగా.. అక్కడి రవాణాశాఖ అధికారులు తమ వాహనాన్ని టాక్స్ చెల్లించలేదని ఆపారని చెప్పారు. అంతేకాదు.. ఒకేసారి లక్షా 68 వేల 70 రూపాయలు చలానా విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత భారీగా చలనా విధిస్తే.. ఎలా కట్టాలని ఆయన ప్రశ్నించారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించినట్లే తమపై విధించే పన్నులు తగ్గించాలని సీఎం జగన్‌ను వేడుకున్నారు.