ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్​జోన్​ను పరిశీలించిన అనంతపురం ఎస్పీ - sp asubabu in gunthakallu red zone

అనంతపురం ఎస్పీ సత్యఏసుబాబు గుంతకల్లులోని రెడ్​జోన్​లో పర్యటించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. ప్రజలంతా లాక్​డౌన్​ను పాటించి పోలీసులకు సహకరించాలన్నారు.

anantapur sp inspection in gunthakallu red zoen area
రెడ్​జోన్​ను పరిశీలించిన అనంతపురం ఎస్పీ

By

Published : Apr 24, 2020, 10:45 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో రెడ్​జోన్​గా ప్రకటించిన ప్రాంతంలో అనంతపురం ఎస్పీ సత్య ఏసుబాబు పర్యటించారు. రెడ్​జోన్​లో తీసుకుంటున్న చర్యలను స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్​, డీఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుంతకల్లు మండలం కసాపురం వద్ద ఉన్న అనంతపురం-కర్నూలు సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసుల విధులకు ఎవరైనా భంగం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. గుంతకల్లులో పోలీసులు మరింత పటిష్టంగా లాక్​డౌన్ అమలు చేస్తున్నారన్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటిస్తూ, ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details