SP Fakkirappa: సీఎం పర్యటన సందర్భంగా ప్లకార్డులతో నిరసన తెలిపినందుకే ప్రకాశ్‌ను సర్వీస్ నుంచి తొలగించారని కొన్ని పార్టీలు ఆరోపించడం సరికాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు 2019లో లక్ష్మి చేసిన ఫిర్యాదు ఆధారంగానే కానిస్టేబుల్ ప్రకాశ్‌ను డిస్మిస్ చేశామని, ఇతర కారణాలేవీ లేవని తెలిపారు. ‘ప్రకాశ్‌పై ఇప్పటికే 5 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఓ మహిళతో అనుచిత ప్రవర్తన, మహిళా హోంగార్డును వేధించిన కేసులూ ఉన్నాయి. ఇంక్రిమెంట్ల వాయిదా, ఛార్జిమెమోలతో పాటు 8 పనిష్మెంట్లు ఉన్నాయి. 2018లో ఘటన జరిగితే బాధితురాలు 2019 జులైలో స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగానే డీఎస్పీతో మూడేళ్లపాటు విచారణ జరిపించాం. 45 రోజుల వ్యవధిలో మూడు నోటీసులు పంపించాం. ఎలాంటి స్పందన లేకపోవడంతో చర్యలు తీసుకున్నామ’ని ఎస్పీ వివరించారు. తన వాంగ్మూలాన్ని మార్చారని బాధితురాలు ఇప్పుడు చెప్పడం సరికాదని, ఆమె మీడియాకు చూపించిన ఫిర్యాదు ప్రతులకు, ఈ చర్యలకు సంబంధం లేదని అన్నారు. తనకు అన్యాయం జరిగిందని ప్రకాశ్ భావిస్తే 30 రోజుల్లోగా అప్పీల్‌కు, కోర్టుకు వెళ్లొచ్చన్నారు. పోలీస్ శాఖపై నిందలు వేయడం మానుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
SP Fakkirappa: బాధితురాలి ఫిర్యాదు మేరకే చర్యలు: ఎస్పీ ఫక్కీరప్ప - అనంతపురం జిల్లా వార్తలు
SP Fakkirappa: తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు 2019లో లక్ష్మి చేసిన ఫిర్యాదు ఆధారంగానే కానిస్టేబుల్ ప్రకాశ్‌ను డిస్మిస్ చేశామని, ఇతర కారణాలేవీ లేవని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. 2018లో ఘటన జరిగితే బాధితురాలు 2019 జులైలో స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగానే డీఎస్పీతో మూడేళ్లపాటు విచారణ జరిపించామని ఎస్పీ అన్నారు.
ఎస్పీ ఫక్కీరప్ప