నకిలీ తాళాల సాయంతో ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లే దొంగను అనంతపురం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 6,58,000 విలువ చేసే 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
జల్సాల కోసం దొంగగా మారి.. చివరికి కటకటాలపాలై.. - అనంతపురం నేర వార్తలు
ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అనంతపురం రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వ్యసనాలకు అలవాటు పడి దొంగగా మారినట్లు దర్యప్తులో వెల్లడైందని సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపారు.
జల్సాల కోసం దొంగగా మారి ... చివరికి కటకటాలపాలై..