అనంతపురం జిల్లా కేంద్రంలో పోలీసులు సాయంత్రం ఫుట్ పెట్రోలింగ్, విజబుల్ పోలీసింగ్ జరిపారు . జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాలతో వన్ టౌన్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు పై వాహనాలు అడ్డంగా నిలిపి ఉంచకుండా చర్యలు తీసుకున్నారు. అల్లరి మూకలు, ఈవ్ టీజర్స్ , బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై నిఘా ఉంచారు. జనం గుమిగూడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అల్లర్లు, గొడవలకు దిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది కల్గకుండా రహదారులపై తోపుడు బండ్లు పెట్టుకోరాదని సూచించారు.
అనంతపురంలో అల్లరి మూకలు, ఈవ్ టీజర్స్ పై నిఘా - అనంతపురం తాజా వార్తలు
అనంతపురం పోలీసులు ఫుట్ పెట్రోలింగ్, విజబుల్ పోలీసింగ్ చేపట్టారు. రహదారులపై అడ్డదిడ్డంగా వాహనాలు పార్క్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. అల్లరి మూకలు, ఈవ్ టీజర్స్ పై నిఘా ఉంచారు.
అనంతపురంలో అల్లరి మూకలు పై నిఘా