వైభవంగా సాగిన అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు పుష్పయాగంతో ముగిశాయి. ఆలయంలోని ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించారు. 12 రకాల పుష్పాలతో అర్చకులు స్వామి వారికి విశిష్ట పూజలు నిర్వహించారు. నయన శోభితంగా సాగిన ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుష్ప యాగంతో నారసింహుడి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
పుష్పయాగంతో ముగిసిన కదిరి నరసింహుని బ్రహ్మోత్సవాలు - పుష్పయాగంతో ముగిసిన కదిరి నరసింహుని బ్రహ్మోత్సవాలు
అనంతపురం జిల్లాలోని కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. పుష్పయాగం కన్నుల పండువగా జరిగింది. భారీ స్థాయిలో భక్తులు హాజరయ్యారు.
పుష్పయాగంతో ముగిసిన కదిరి నరసింహుని బ్రహ్మోత్సవాలు