అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హవళిగి గ్రామానికి చెందిన రైతు హనుమంతు(60) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పంట కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవటం, పంట సరిగ్గా పండకపోవటంతో ఆవేదన చెందిన రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల భారం మరో అన్నదాత ప్రాణం తీసింది - అప్పుల బాధతో అనంతపురం రైతు ఆత్మహత్య
అనంతపురం జిల్లా హవళిగి గ్రామానికి చెందిన రైతు హనుమంతు(60) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పంటపై తెచ్చిన అప్పులు పెరిగిపోవటంతో మనస్థాపానికి గురైన రైతు బలన్మరణానికి పాల్పడ్డాడు.
అప్పుల భారం మరో అన్నదాత ప్రాణం తీసింది
ఆదివారం ఉదయం రైతు తన పొలంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. రైతును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :చెరుకు రైతుల ఆవేదన... డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్న షుగర్ ఫ్యాక్టరీ