ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారీ దీక్షకు వెళుతుండగా అనంతపురం మాజీ మేయర్​ అడ్డగింత - అనంతపురం వార్తలు

నారీ దీక్షకు వెళుతుండగా అనంతపురం మాజీ మేయర్ స్వరూపను పోలీసులు​ అడ్డగించారు. గుంతకల్లు రైల్వే స్టేషన్​లో ఆమెను బలవంతంగా రైలు నుంచి దింపేశారు.

anantapur ex mayor arrest in guntakallu
anantapur ex mayor arrest in guntakallu

By

Published : Jan 31, 2022, 6:47 AM IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తలపెట్టిన నారీ దీక్షకు ప్రశాంతి ఎక్స్​ప్రెస్​లో వెళ్తున్న అనంతపురం మాజీ మేయర్ మదమంచి స్వరూపను గుంతకల్లు ఒకటో పట్టణ పోలీసులు రైల్వే స్టేషన్​లో అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం నుంచి రైలులో విజయవాడకు వెళ్తున్న ఆమెను అడుగడుగునా అడ్డగించిన పోలీసులు ఎట్టకేలకు గుంతకల్లు రైల్వే స్టేషన్​లో రైళ్లో నుంచి బలవంతంగా కిందకు దింపారు. మహిళలకు వైకాపా పాలనలో రక్షణ కరవైందని.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఇదే పరిస్థితి ఉందని విమర్శించారు. విజయవాడలో చిన్నారిపై జరిగిన అత్యాచారానికి నిరసన తెలియజేయకుడా.. పోలీసులు అడ్డుకోవడం చాలా దారుణంగా ఉందన్నారు. పోలీసుల అనుచిత తీరుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంతకల్లుకు చెందిన టీడీపీ నాయకులు రైల్వే స్టేషన్​కు వచ్చి ఆమెను పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details