ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ శాఖ అధికారులపై గ్రామస్థుల ఆగ్రహం - అనంతపురం జిల్లా తాజా మరణ వార్తలు

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ గ్రామంలో ఓ యువకుడు చనిపోయాడని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం బనాన్ చెరువు పల్లి గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులను నిలదీశారు.

anantapur dst villager fired on power department employees
anantapur dst villager fired on power department employees

By

Published : Jun 18, 2020, 10:31 PM IST

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం బనాన్ చెరువు పల్లి గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులను నిలదీశారు. గ్రామానికి చెందిన యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే యువకుడు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై విద్యుత్ శాఖ ఏఈ గ్రామంలో పర్యటించి స్థానిక అధికారిని ప్రశ్నించారు. గ్రామంలో నివాసాల గోడలకు సైతం విద్యుత్ సరఫరా అవుతోందని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details