ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా బాధితులను ఉచితంగా ఆసుపత్రికి తరలించిన డ్రైవర్ - covid news in anantapur dst

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఓ ఆటోడ్రైవర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. కరోనా రోగులను తరలించటానికి వేలకు వేలు వసూలు చేస్తున్న ఈ రోజుల్లో ఉచితంగా 13మంది బాధితులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించాడు.

anantapur dst urvakonda  auto driver transport corona patients to hospital with free of coast
anantapur dst urvakonda auto driver transport corona patients to hospital with free of coast

By

Published : Aug 7, 2020, 1:52 PM IST

కరోనా వచ్చిందని తెలిస్తే చాలు ఆమడ దూరం పారిపోతున్న పరిస్థితులున్న ఈ రోజుల్లో అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఓ ఆటో డ్రైవర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఉరవకొండ మండలం కోనాపురంలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షలో 13 మంది వైరస్ బారిన పడ్డారు. వారిని తరలించడానికి వైద్యాధికారి రంజిత్ కుమార్ అత్యవసర వాహనానికి సమాచారం ఇస్తుండగా అదే గ్రామానికి చెందిన టాటా ఏస్ వాహనం డ్రైవర్ జగదీష్ వారిని ఉచితంగా తన వాహనంలో తరలించడానికి ముందుకు వచ్చాడు. వారందరినీ అనంతపురంలోని కొవిడ్ కేర్ కేంద్రానికి చేర్చారు.

ABOUT THE AUTHOR

...view details